05-05-2025 01:59:06 AM
న్యూఢిల్లీ, మే 4: ‘నేను హమీనిస్తున్నా.. మోదీ నాయకత్వంలో మీరు కోరకున్నది కచ్చితంగా జరుగుతుంది’ అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘దేశంపై దాడి చేసేందుకు ధైర్యం చేసిన వారికి తగిన సమాధానం ఇవ్వడం నా బాధ్యత.
మోదీ పనితనం గురించి మీకు తెలుసు. దేశ భద్రత కోసం అవసరమైన చర్యలను ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మన దేశ భౌతిక స్వరూపాన్ని సైనికులు కాపాడుతుంటే, రుషులు, జ్ఞానులు దేశ ఆధ్యాత్మిక రూపాన్ని పరిరక్షిస్తున్నారు.’ అని అన్నారు.