29 April, 2026 | 2:13 AM

వేధింపులపై వెంటనే ఫిర్యాదు చేయండి

29-04-2026 12:12 AM

మంచిర్యాల, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): పని ప్రదేశాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో మహిళలు వేధింపులకు గురైతే వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఇన్చార్జ్ ఎస్‌ఐ హైమ కోరారు. మంగళ వారం మంచిర్యాల ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు మహిళలు, పిల్లల భద్రత, లింగ సమానత్వం, బాల్య వివాహాల నిర్మూలనపై ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మహిళలు,

విద్యార్థుల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించి పిల్లల భద్రతకు సంబంధించిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు బాధితులు డయల్ 100 కు లేదా షీ టీమ్స్ వాట్సాప్ నంబర్ (6303923700)కు సమాచారం ఇవ్వాలన్నారు. బాధితులు ఎలాంటి భయం లేకుండా ముందుకు రావాలని, అలాగే 18 ఏండ్లలోపు బాలికల వివాహాలు జరగకుండా సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుజాత, అసిస్టెంట్ ప్రొఫెసర్ వనజ, అధ్యాపక బృందం, మంచిర్యాల షీ టీమ్ సిబ్బంది కానిస్టేబుళ్లు సతీష్, జ్యోతి, విద్యార్థినులు పాల్గొన్నారు.