25 August, 2026 | 2:12 AM

బాధితులకు సత్వర న్యాయమే లక్ష్యం

25-08-2026 01:44 AM

వనపర్తి మండలం ఆగస్టు 24: ప్రజావాణి ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించాలని ఎస్పీ సునితారెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో 12 మంది బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో 9 భూ వివాదాలు, 2 గొడవలు, ఒక భార్యాభర్తల సమస్య ఉన్నాయి. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా చూడాలని సూచించారు.