రామాయంపేట రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఏర్పాటుపై వినతిపత్రం
పద్మా దేవేందర్ రెడ్డిని కలిసిన ఉద్యమ నేత అశ్విని శ్రీనివాస్
రామాయంపేట, మే 18 : రామాయంపేట నిజాంపేట మండలాల ప్రజల అవసరాల కొరకు ఏర్పాటు చేసిన రెవెన్యూ డివిజన్ కార్యాలయం గురించి నేను అడగగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ మేము ఎన్నికల హడావిడిలో ఏర్పాటు చేయలేము అని చెప్పుకోవడం ప్రస్తుత ఎమ్మెల్యే చేతగానితనానికి నిదర్శనం అన్నారు. కార్యాలయం ఏర్పాటు చేస్తున్న సమయంలో జిల్లా కలెక్టర్ ప్రొసీడింగ్ చేసి అధికారికంగా కార్యాలయము ను ప్రారంభోత్సవం చేసి తూప్రాన్ ఆర్డీవో కి ఇన్చార్జ్ బాధ్యతలను అప్పజెప్పి, కొంతమేరకు సిబ్బందిని ఏర్పాటు చేశారు . ఎన్నికల తర్వాత ఆ ప్రొజెడింగును గెజిట్ రూపంలోకి తీసుకురాకపోవడమే మన రామయంపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు నోసుకోకపోవడం అని అన్నారు.
రెవెన్యూ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తే ఈ ప్రొసీడింగ్ ఉన్నఫలంగా గెజిట్ రూపంలోకి మారి పూర్తిస్థాయి ఆర్డీవో మరియు సిబ్బంది తోపాటు రామయంపేటలో ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసుకోవచ్చు. కేసీఆర్ ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే పూర్తిస్థాయి ఆర్డిఓ కార్యాలయం ఏర్పాటు అయి ఉండేది కేవలం ప్రభుత్వం మారిన కారణంగానే రామాయంపేట ఆర్డీవో కార్యాలయానికి నోచుకోలేదని అన్నారు. కేవలం గత ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేయడం కొరకే ప్రజల అవసరాలతో ఆడుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.






