calender_icon.png 26 January, 2026 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరేడ్ గ్రౌండ్‌లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

26-01-2026 12:13:59 PM

జాతీయ జెండా ఆవిష్కరించిన కలెక్టర్ కె. హరిత 

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె. హరిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను  ఆసక్తిగా తిలకించారు. వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు అధికారులకు  ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ,  ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా ఎస్పీ నితిక పంత్, జాయింట్ కలెక్టర్ డేవిడ్, అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా, డీఎఫ్‌ఓ నిరజ్ కుమార్‌తో పాటు వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.