calender_icon.png 26 January, 2026 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమయపాలన పాటించని మేడారం బస్సులు

26-01-2026 12:17:43 PM

తప్పని భక్తుల తిప్పలు

గుండాల, జనవరి 26 (విజయక్రాంతి): ఇల్లందు డిపో నుండి గుండాల వయా పస్రా మీదుగా తెలంగాణ మహా కుంభమేళ మేడారం సమ్మక్క సారక్క జాతరకు వెళ్లే భక్తులకు ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించకపోవడం వల్ల నిరీక్షణతో తిప్పలు తప్పడం లేదు. ఆదివారం నుండి ఇల్లందు టూ మేడారం గుండాల వయా పస్రా మీదుగా ఆర్టీసీ బస్సులు నడవడంతో మండల కేంద్రంలోని పస్రా వెళ్లే బస్ స్టాప్ వద్ద ప్రయాణీకులు(భక్తులు) సోమవారం అధికంగా పెరగడంతో ఒక్క బస్సు రాక వారు ఇబ్బందిపడ్డారు.

ఇల్లందు బస్టాండ్ లో సుమారు పదిహేను మంది భక్తులు మేడారంకు ప్రయాణమై వస్తే మేడారం బస్సులు లేవు గుండాల నుండి ఉన్నాయి అని ఆర్టీసీ సిబ్బంది తెలపడంతో వారు గుండాలకు వచ్చే బస్సు ఎక్కి పస్రా బస్ స్టాప్ వద్ద మూడు గంటలు మేడారం వెళ్లే భక్తుల ప్రతీ ప్రయివేట్ వాహనాన్ని ఆపుతూ, తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొని, మండల కేంద్రంలోని ఒక ప్రయివేట్ వాహనాన్ని కిరాయికి మాట్లాడుకుని మేడారం వెళ్లారు.

ఈ విషయం 'విజయక్రాంతి' విలేఖరికి తెలపగా ఇల్లందు బస్టాండ్ కు ఛరవాణిలో మాట్లాడగా భక్తులు పది మంది మాత్రమే ఉండడంతో గుండాల నుండి ఉంటాయని తెలిపామని అన్నారు. మేడారానికి ఈ రోజు అసలు బస్సులే లేవని తెలిపారని అన్నారటగా అని వివరణ అడగగా బస్సులు ఖమ్మం నుండి రావాలని ఇప్పుడు ఇల్లందు బస్టాండ్ లో బస్ ఉందని భక్తులు ఇరువై మంది ఉన్నారని, ఇంకో అరగంటలో ఇల్లందు బస్టాండ్ నుండి బయలుదేరుతుందని తెలిపారు. విపరీతంగా పెరుగుతున్న భక్తుల దృష్టా బస్సులను సమయానికి నడిపి భక్తుల ఇబ్బందులను తగ్గించాలని వారు కోరుతున్నారు.