26-01-2026 12:11:40 PM
సిద్దిపేట రూరల్ మండల కాంగ్రెస్
జాతీయ జెండా ఘన ఆవిష్కరణ
సిద్దిపేట, జనవరి 26: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సిద్దిపేట రూరల్ మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గుర్రం అంజిరెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ విలువలను కాపాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కట్టుబడి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట రూరల్ మండల సీనియర్ నాయకులు మల్లారెడ్డి, అంజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి,రూరల్ మండల సేవాలాల్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.