26-01-2026 04:15:11 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నిర్వహణలో వెంకీస్ క్లాసిక్ టు జూనియర్, సీనియర్, మాస్టర్స్ బాడీ బిల్డింగ్ ఛాంపియన్ షిప్ పోటీలలో బెల్లంపల్లి స్కై జిమ్ కు చెందిన పలువురు బాడీ బిల్డర్లు పాల్గొని విజేతలుగా నిలిచారు. ఆదివారం రాత్రి నస్పూర్ సిఈ ఆర్ క్లబ్ వద్ద జరిగిన మిస్టర్ సిసిసి, మిస్టర్ మంచిర్యాల, మెన్స్, జూనియర్ బాడీ బిల్డింగ్, మాస్టర్ బాడీ బిల్డింగ్, మెన్స్ సీనియర్ బాడీ బిల్డింగ్ పోటీలు అబ్బురపరిచాయి. బెల్లంపల్లి స్కై జిమ్ కు చెందిన జి.లక్ష్మణ్ 75 కిలోల విభాగంలో జె. మొగిలి 80 కిలోల విభాగంలో, డి. ప్రశాంత్ 85 కిలోల విభాగంలో ప్రథమ స్థానాలు పొందారు.

పి. కృష్ణ స్వామి మాస్టర్స్ విభాగంలో ప్రథమ స్థానం, 55 కిలోల విభాగంలో తృతీయ స్థానం సంపాదించాడు. ఎం. రోహిత్ 60 కిలోల విభాగంలో మూడవ స్థానం, జూనియర్స్ పోటీలలో నాలుగవ స్థానం సాధించాడు. మీర్జా హుమాయున్ జూనియర్స్ విభాగంలో ఐదవ స్థానం, ఎం. మహేష్ 50 కిలోల విభాగంలో 5వ స్థానం, కె నగేష్ మాస్టర్స్ విభాగంలో ఐదవ స్థానం పొందినట్లు స్కై జుమ్ నిర్వాహకులు పి. సదానందం బాలకృష్ణ చంద్రశేఖర్ తెలిపారు. బాడీ బిల్డింగ్ పోటీలలో విజయం సాధించిన క్రీడాకారులను పలువురు సీనియర్ క్రీడాకారులు అభినందించారు.