26-01-2026 03:49:20 PM
మఠంపల్లి: సూర్య పేట జిల్లా మఠంపల్లి మండలంలోని మఠంపల్లి కేంద్రంలో ఉన్న అయ్యప్ప స్వామి దేవాలయం పునర్నిర్మాణం కొరకు కాల్వపల్లి తండా సర్పంచ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాలోతు సక్రు నాయక్ సుజాత దంపతులు లక్షా రూపాయలు ఆర్థిక సహాయం సోమవారం చేశారు. ఈ సందర్భంగా సక్రు నాయక్ మాట్లాడుతూ అయ్యప్పస్వామి దేవాలయం పునర్నిర్మాణం కొరకు ఆర్థిక సహాయం చేయడం ఎంతో సంతోషంగా ఉందని,ఆ దేవుని దీవెనలు ఆశీర్వాదాలు ప్రజలందరి పై ఉండాలని కోరారు.అనంతరం కమిటీ సభ్యులు ఆర్థిక సహాయం చేసిన సర్పంచ్ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు.