26-01-2026 04:03:04 PM
తుంగతుర్తి సర్పంచ్ మల్లెపాక సాయిబాబా
తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రం లో ప్రజలు ప్రయానికుల కోసం నియోజకవర్గ కేంద్రానికి వివిధ అవసరాల కోసం వచ్చి టాయిలెట్ లేక ఇబ్బందులు పడుతున్న ప్రజల కు ఈ పబ్లిక్ టాయిలెట్ ఉపయోగ పడుతుంది అని స్థానిక సర్పంచ్ మల్లెపాక సాయిబాబా అన్నారు. ప్రధాని మోడీ స్వచ్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో టాయిలెట్ నిర్మాణం చేపడుతున్నామని అన్నారు. గడచిన పది సంవత్సరాల కాలంలో ఎంతోమంది ప్రజా ప్రతినిధులు వచ్చినప్పటికీ, టాయిలెట్ నిర్మాణం చేపట్టకపోవడం బాధాకరమైన విషయం అన్నారు. త్వరితగతన పూర్తి చేయుటకు కృషి చేస్తామని అన్నారు. టాయిలెట్స్ నిర్మాణ శంకుస్థాపన పట్ల ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు సంకినేని రవీందర్రావు ఉపసర్పంచ్ శ్రీను , వార్డు సభ్యులు పాల్గొన్నారు.