calender_icon.png 26 January, 2026 | 5:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతిపిత మహాత్మా గాంధీకి ఇదే నా గౌరవం...?

26-01-2026 04:18:01 PM

బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల డిమాండ్

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మహాత్మా గాంధీ చిత్రపటం ఇలా నేలపై పడేసి ఉంచడం మహాత్మ గాంధీకి అవమానకరం చేసిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గ్రామంలో పూర్తిగా విచారణ చేపట్టాలని ఎలాంటి వారైనా ఉపేక్షించవద్దని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు పేర్కొంటున్నారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన మహానుభావుడు గాంధీజీకి గ్రామపంచాయతీ కార్యాలయం సిబ్బంది ఇచ్చేది ఇదేనా గౌరవం? అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.