calender_icon.png 26 January, 2026 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుల్తానాబాద్ లో రెపరెపలాడిన మువ్వన్నెల జాతీయ జెండాలు

26-01-2026 03:53:40 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం  సుల్తానాబాద్ లో జాతీయ జెండాల ఆవిష్కరణ ఘనంగా జరిగింది, స్థానిక కోర్టులో మెజిస్ట్రేట్ దుర్గం గణేష్ జెండా ఆవిష్కరించారు, తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ బషీరుద్దీన్,  పోలీస్ స్టేషన్ లో సీఐ సుబ్బారెడ్డి, జెండా ఆవిష్కరించగా ఎస్సై చంద్రకుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విధి నిర్వహణలో చురుకుగా వ్యవహరిస్తున్న పోలీస్ రైటర్ రేణుక ను సీఐ, ఎస్సై ఘనంగా సన్మానించారు.

మున్సిపల్ కార్యాలయంతో పాటు కార్యాలయం ముందు ప్రధాన కూడలిలో కమిషనర్ తిప్పరాజు రమేష్, మండల విద్యా వనరుల కార్యాలయంలో ఎంఈఓ ఆరే పల్లి రాజయ్య,  ట్రాన్స్కో కార్యాలయంలో ఏడి గంగయ్య, సింగిల్ విండో కార్యాలయంలో సీనియర్ ఉద్యోగి న్యాతరి రాజు, చిన్న కాలువల, గర్రెపల్లి, సుద్దాల, కనుకల,  లలో  రమేష్, సతీష్, దేవేందర్, వ్యవసాయ మార్కెట్ కార్యాలయ ఆవరణలో చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, సివిల్ ఆస్పత్రిలో సూపర్డెంట్ రమాదేవి, గర్రెపల్లి పిహెచ్సితో పాటు మండలంలోని అన్ని హెల్త్ సెంటర్లలో ఆయా సెంటర్లో ఇన్చార్జిలు జెండాలను ఆవిష్కరించారు.

ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ప్రవేట్ విద్యాసంస్థలలో ప్రధానోపాధ్యాయులతో పాటు ప్రభుత్వ ప్రైవేటు బ్యాంకింగ్ రంగాలలో మేనేజర్లు, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, వివిధ కూడలిలలో తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, బస్టాండ్ తో పాటు ఆటో యూనియన్, లారీ అసోసియేషన్, వివిధ కార్మిక సంఘాలు, రైస్ మిల్ అసోసియేషన్ లో అధ్యక్షులు పురుషోత్తం రావు జెండా ఎగురవేశారు, ఆర్యవైశ్య భవన్ లో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొమురవెల్లి భాస్కర్, వాసవి క్లబ్ అధ్యక్షుడు రామిడి రవీందర్ ఇంటి వద్ద రామిడీ రవీందర్ జెండా ఆవిష్కరించారు.

ఎల్లంకి వైకుంఠం ఇంటి వద్ద వాసవి వనిత క్లబ్ అధ్యక్షురాలు ఎల్లంకి విజయ జెండా ఆవిష్కరించారు, వివిధ ప్రైవేటు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు దేశ నాయకుల వేషధారణలతో భాజభజేంద్రిలతో మండలం, పట్టణంలో ర్యాలీలు నిర్వహించారు. పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలతో పాటు ముఖ్య కూడళ్లు తదితర ప్రదేశాలలో జాతీయ పతాకాలను ఆవిష్కరించి సంబరాలు నిర్వహించారు...