05-09-2025 12:28:54 AM
ఆలంపూర్, సెప్టెంబర్ 04:రైతులకు సకాలంలో యూరియా ఎరువులు అందక రో జుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితి రైతుల్లో నెలకొందని దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని బిఆర్‌ఎస్ నాయకులు తహసీల్దార్ మంజులకు ,వ్యవసాయ అధికారి నాగార్జున రెడ్డికి విన్నవించా రు.
మంగళ వారం వారిని కలిసి వినతి పత్రా న్ని అందజేశారు.ముఖ్యంగా కౌలు రైతుల పరిస్థితి మరి దయనీయంగా ఉందని తెలిపా రు.రైతులకు సరిపడా యూరియా అందకపోవడంతో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభా వం చూపుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అధికారులకు వివరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.