calender_icon.png 5 September, 2025 | 8:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదం అంచున మేడారం చెరువు

05-09-2025 12:29:42 AM

-కుండపోత వర్షాలకు తూము వద్ద బుంగ పడె..

-నీరంతా వృథాగా పోతుండేని రైతుల ఆరోపణ

-అధికారులు మరమ్మతులు చేపట్టకనే బుంగ పడె..

--రైతులె జెసిబితొ బుంగను పూడ్చుకునె,,

తాడ్వాయి, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): శివ శివా శివరాం సాగర్ చెరువయ్యా ప్రమాదంలో ఉంది. కాపాడవయ్యా అని రైతులు శివయ్యను కోరుతున్నారు. ఆ శివయ్య అయినా కనికరించి అధికారులను పంపిస్తాడని వేడుకున్నట్లు తెలిపారు. మేడారంలోని శివరాంసాగర్ చెరువు తూమువద్ద బుంగపడింది.

ప్రమాదం అంచుల్లొ ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం రోజులుగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. చెరువు కట్టంతా మెత్తబడింది. రెండెండ్ల కాలంగా చెరువు కట్ట, తూము మత్తడి మరమ్మత్తులు లేకపోయింది. అదికారులు దృష్టికి తీసుకుపోతె అధికారులు సందర్సించి పరశీలించారు. మరమ్మత్తు పనులకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు తెలిపారు అవి రాగానె పనులు చేయించుతామని అధికారులు రైతులకు చెప్పారు.

వారం రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి వరద పెరగడంతొ తూమువద్ద బుంగపడింది చెరువు నీళ్లన్నీ రోడ్డుకు వస్తుండటాన్ని గ్రామస్తులు చూసి రైతులకు తెలిపారు. రైతులు చెరువు దగ్గరకు వెల్లి చూడగా తూముగుండా బయటకు వృథాగా పోతుంది. ఈ విషయాన్ని గమనించిన రైతులు జెసిబి మిషన్ తీసుకొచ్చి బుంగను పూడ్చివేయించారు. ప్రస్తుతానికి నీరు పోకుండా ఆపగలిగామని తెలుపారు.

ఆయకట్టు కింద సాగుబడి అయ్యె పోలాలు 150ఎకరాల దాకపంటలు సాగు చేస్తున్నారు. ఈచెరువు నీళ్లు ఊరట్టం శివారు దాక పోతాయని రైతులు తెలీపారు. ఇప్పుడు చెరువులోని నీరు బుంగ ద్వార వృథాగా బయటకు పోతె పంటలు పొట్ట దశకు వచ్చిన క్రమంలొ నీరు కావలసివస్తుందన్నారు. నీరందకపోతె చేతి కొచ్చిన పంట ఎండిపోతుందని తెలిపారు. పంటలపై ఆదారపడిన ఎన్నొ రైతుల కుటుంబాలు నష్ట పోవలసి వస్తుందన్నారు. చెరువుపై దృష్టిపెట్టిన వాళ్లులేరని అన్నారు.