calender_icon.png 4 November, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని ఎమ్మార్వోకు వినతి

04-11-2025 12:05:14 AM

యాచారం  నవంబర్ 3 : బీసీల 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వలు దీనిపై వెంటనే ఆమోదం తెలపాలని సీనియర్ అడ్వకేట్ ముక్తాల యాదయ్య గౌడ్ డిమాండ్ చేశారు.42 శాతం బీసీ రిజర్వేషన్ సాధన సమితి కమిటీ పిలుపుమేరకు బిసి ఎస్సి, ఎస్టి జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం  యాచారం తహశీల్దార్ కార్యాలయంలో ఎమ్మార్వోకి 42 శాతం రిజర్వేషన్ సాధనకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా జేఏసీ నేతలు  మాట్లాడుతూ.

42శాతం బీసీ రిజర్వేషన్స్ అమలు స్థానిక సంస్థల ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. బీసీ రిజర్వేషన్స్ సాధన కోసం మరో స్వాతంత్ర పోరాటం లా ఉద్యమించాలన్నారు. రాష్ర్ట ప్రభుత్వం అఖిలపక్ష బృందాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానమంత్రి , రాష్ర్టపతిని కలిసి బీసీ రిజర్వేషన్ల సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఈ కార్యక్రమంలో  అడ్వకేట్  ఆకుల బిక్షపతి, దార చెన్నయ్య, గణేష్,బుగ్గరాములు,బిక్షపతి, పాండారి,గోరటి వెంకటేష్, నక్క మహేందర్, ముచ్చర్ల యాదగిరి, శ్రీనివాస్,తెలగమల్ల ప్రవీణ్, పంది జయరాజ్, సైతాన్ బాలరాజ్, జెఏసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.