04-11-2025 06:31:32 PM
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి(CMRF) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయానికి సంబంధించిన 26 చెక్కులను ఎమ్మెల్యే కోవ లక్ష్మి మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి అనేది ఆపదలో ఉన్న ప్రజలకు అండగా నిలుస్తోందన్నారు. అనారోగ్యం, ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ నిధి ఎంతో ఉపయోగకరంగా మారిందని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.