04-11-2025 06:28:18 PM
బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): పత్తి కొనుగోలులో సీసీఐ విధించిన కొత్త నిబంధనలపై రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు ఆవిడపు ప్రణయ్ కుమార్ అన్నారు. సీసీఐ ద్వారా ఎకరాకు కేవలం ఏడు క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేసే నిబంధనను వెంటనే రద్దు చేసి, గతంలా ఎకరాకు 12 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని బీసీ యువజన సంఘం నాయకులతో కలిసి మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆవిడపు ప్రణయ్ మాట్లాడుతూ రైతులు ఆరు నెలల కష్టానికి ప్రతిఫలంగా పండించిన పత్తిని ప్రకృతి వైపరీత్యాలు ఒకవైపు, సీసీఐ పరిమితి నిబంధనలు మరోవైపు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గతంలో ఎకరాకు 12 క్వింటాళ్లు చొప్పున కొనుగోలు చేయగా, ఇప్పుడు ఏడు క్వింటాళ్లకే పరిమితం చేయడం వల్ల రైతులు క్వింటాలకు రూ.2000 వరకు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది అన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం నాయకులు మెంగ్రే ఆకాష్, మేకర్తి అరుణ్, పిప్పిరి సమ్మన్నా, దాడి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.