04-11-2025 06:33:53 PM
ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరు రమేష్ బాబు..
కల్వకుర్తి: వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా సమాజంలోని అన్ని వర్గాలకు సామాజిక సేవలు అందిస్తున్నామని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జూలూరు రమేష్ బాబు అన్నారు. మంగళవారం పట్టణంలో వాసవి క్లబ్, వనిత క్లబ్ కల్వకుర్తి నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో వాసవి క్లబ్ ల ఆధ్వర్యంలో సేవలు నిర్వహిస్తున్నామన్నారు. చేసిన సేవలకు రాష్ట్రపతి అవార్డు సైతం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కు లభించింది గుర్తు చేశారు.
కల్వకుర్తి వాసవి క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న సేవలు మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు. అనంతరం వాసవి క్లబ్ అధ్యక్షునిగా బాదం హరీష్, కార్యదర్శిగా గోవింద సంతోష్, కోశాధికారిగా మాచిపెద్ది రవి, వనిత క్లబ్ అధ్యక్షురాలుగా బాదం సాయి లక్ష్మి, కార్యదర్శిగా గోవిందు మౌనిక, కోశాధికారిగా మాచిపెద్ది కల్పనను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గం 2026లో క్లబ్ సేవలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు. క్లబ్ ఇంటర్నేషనల్ అడిషనల్ కోశాధికారి కల్వ హరికృష్ణ మాట్లాడుతూ గతానికి భిన్నంగా సేవలను కొనసాగించాలన్నారు. నూతన కమిటీని శాలువాలతో ఘనంగా సత్కరించారు.