04-11-2025 12:03:18 AM
బిచ్కుంద, నవంబర్ 03: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లం, జుక్కల్,బిచ్కుంద మరియు డోంగ్లీ మండల కేంద్రాల్లో సోమవారం సోయా కొనుగోలు కేంద్రాలను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ప్రారంభించారు.ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన సోయా పంటకు క్వింటాకు రూ.5,328 చొప్పున ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించిందన్నారు. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.
రైతులెవరూ దళారులను నమ్మి మోసపోవద్దు అని అన్నారు.రైతుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో బిచ్కుంద మార్కెట్ కమిటీ చైర్మన్ కవితా ప్రభాకర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ నల్చర్ బాలు, పిసిసి డెలికేట్ విట్టల్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెడ్డి, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
డోంగ్లిలో సోయా కొనుగోలు కేంద్రం ఏర్పాటు
డోంగ్లీ మండల కేంద్రంలో నూతన సొసైటీ కార్యాలయాన్ని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.. అనంతరం డోంగ్లీ మండల కేంద్రంలోని రేషన్ షాపులో ప్రజా ప్రభుత్వం లబ్దిదారులకు రేషన్ తో పాటు ప్రత్యేకంగా అందిస్తున్న 5 కేజీల సంచులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ కార్యక్రమం లో మద్నూర్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్, సోసైటీ ఛైర్మన్ రాం పటేల్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మద్నూర్‌లో సీసీఐ కొనుగోలు కేంద్రం ప్రారంభం
మద్నూర్ మండల కేంద్రంలో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, ప్రారంభించారు. రైతులు కిసాన్ కపాస్ యాప్ ద్వారా వివరాలు నమోదు చేసుకుని సీసీఐ కొనుగోలు కేంద్రంలో అమ్మకాలు జరపాలని సూచించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లామార్కెట్ శాఖ అధికారి రమ్య, మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ సౌజన్య రమేష్ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ పరమేష్ పటేల్, హనుమాన్ మందిర్ ఆలయ చైర్మన్ రామ్ పటేల్ మండల కాంగ్రెస్ నాయకులుపాల్గొన్నారు.