సొంతింటి నిర్మాణం భరోసా ఇస్తుంది
ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేసిన కౌన్సిలర్ పద్మ
భూత్పూర్, ఏప్రిల్ 1 : మున్సిపాలిటీ పరిధిలోని అమిస్తాపూర్ గ్రామంలో ( 5వ వార్డు) లో లక్ష్మీదేవి అనే లబ్ధిదారురాలి ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి వార్డు కౌన్సిలర్ పద్మ నరేందర్ బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని ఆమె పేర్కొన్నారు. అర్హులైన ప్రతి లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లను అందజేస్తుందన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని ఆమె తెలిపారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు చాలా సంతోషంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగిరి రవి, తిరుపతయ్య, రాజేష్, దిలీప్, మల్లేష్, డోకుర్ శేఖర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.




