calender_icon.png 30 October, 2025 | 11:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమరవీరుల స్మృతిలో ప్రాణదాతలుగా రక్షకభటులు

29-10-2025 12:00:00 AM

చౌటుప్పల్, అక్టోబర్ 29 (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మహా రక్తదాన శిబిరాన్ని చౌటుప్పల్ పోలీస్ శాఖ జి. మన్మధ కుమార్, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చౌటుప్పల్ ఆధ్వర్యంలో గట్టు శ్రీరాములు ఫంక్షన్ హాల్  నందు నిర్వహించడం జరిగింది.

ఈ మహా రక్తదాన శిబిరానికి  ముఖ్యఅతిథిగా చౌటుప్పల్ ఎసిపి పి.మధుసూదన్ రెడ్డి  హాజరు అయ్యి రక్తదానం చేస్తూ రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగినది .

ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్తదానం పట్ల ఎన్నెన్నో అపోహలు ఉన్నాయి అని తల్లిదండ్రులు జన్మనిస్తే రక్తదాతలు ప్రాణదాతలుగా మారి  పునర్జన్మ ప్రసాదించే మహాభాగ్యం మన చేతుల్లో ఉంది అని రక్తదానం చేసిన వారికి రక్తం మరలా పునరుత్పత్తి అవుతుందని అంతేకాకుండా బరువు నియంత్రణలో ఉంటుందని మరియు యవ్వనంగా కనిపించడంతో పాటు నూతన ఉత్తేజంతో  పనులు సకాలంలో చేస్తూ  బద్ధకాన్ని దూరం  చేసుకొని జీవన  విధానాన్ని మెరుగుపరుచుకోవచ్చని  తెలపడం జరిగినది .

ఈ రక్తదాన శిబిర కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన జి.మన్మధ కుమార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ చౌటుప్పల్ , ఎస్‌ఐలు కే యాదగిరి, సిహెచ్ రమేష్, అజయ్ భార్గవ్, ఉపేందర్ రెడ్డి, కృష్ణ మాల్, నర్సిరెడ్డి, పోలీసు సిబ్బంది ఏఎస్‌ఐ లు, హెడ్ కానిస్టేబుల్ లు, కానిస్టేబుల్ లు మరియు యువకులు, విద్యార్థులు తదితరులు  పాల్గొన్నారు.

అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివి

సంస్థాన్ నారాయణపూర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలు మరువలేనివని వారి ఆశయాలను సాధిస్తామని సంస్థాన్ నారాయణపూర్ ఎస్త్స్ర జె.జగన్ అన్నారు. మంగళవారం పోలీసు అమరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యారు లతో కలిసి సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

అనంతరం ఎస్త్స్ర మాట్లాడుతూ దేశ రక్షణ ,శాంతి భద్రత పరిరక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన పోలీసులు సంస్మరణీ యులని అన్నారు. సంఘంలో జరిగే ప్రతీ అన్యాయాన్ని అరికట్టడంలో మొదటి పాత్ర పోషించే పోలీసుల త్యాగాన్ని ప్రజలకు తెలియజేయాలని ఈ వారోత్సవాలను నిర్వహి స్తున్నామని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు పోలీసులకు సత్సంబంధాలు కలుగుతాయని అన్నారు.

అమరులైన పోలీసుల ఆశయాలను నెరవేర్చేలా పనిచేస్తామని యువత పోలీసుల త్యాగాలను ఆదర్శంగా తీసుకొని సమాజ రక్షణ కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఏఎస్‌ఐ మహేందర్ రెడ్డి, కానిస్టేబుళ్ళు సందీప్, శాంతయ్య, లింగారెడ్డి, ఎం.ఉపేందర్, సృజన, కళాశాల విద్యార్థులు అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

వ్యాసరచన, 2కే రన్ పోటీలు

ఆలేరు, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ఆలేరు స్టేషన్ హౌస్ ఆఫీసర్ యాలాద్రి, ఎస్త్స్ర  వినయ్, పోలీసు సిబ్బంది పర్యవేక్షణలో టీనేజీ యువత మాదకద్రవ్యాల ముప్పు దానిని నివారణలో పోలీసుల పాత్ర ఎంత మరియు విద్యార్థిని విద్యార్థులు మాదకద్రవ్యాలకు ఎలా దూరంగా ఉండాలని అనే అంశం మీద వ్యాసరచన పోటీలను నిర్వహించారు.

ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, విఆర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. స్థానిక ప్రభుత్వ కళాశాల నుండి దుర్గమ్మ గుడి వరకు టూకే రన్ నిర్వహించారు. శ్రీ రామకృష్ణ విద్యాలయం విద్యార్థులు ప్రభుత్వ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్ యాలాద్రి మాట్లాడుతూ మాదకద్రవ్యాల వలలో విద్యార్థులు యువత అందులో చిక్కుకోకూడదు అనే ఉద్దేశంతోనే ఇలాంటి వ్యాసరచన పోటీలతో వారికి కొంత అవగాహన కలుగుతాయి, ఆరోగ్యాన్ని దృఢంగా ఉంచుకొనుట కొరకు 2కె రన్ ఎంతో మెరుగుపరుచుకొనుటకు ఈ పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు.