calender_icon.png 29 October, 2025 | 11:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రీ-రిపబ్లిక్ డే క్యాంప్‌నకు బయలుదేరిన అనురాగ్ యూనివర్సిటీ ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు

29-10-2025 12:00:00 AM

ఘట్ కేసర్, అక్టోబర్ 28 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీకి చెందిన టి. అజయ్ విక్రమ్, ఎస్. పూర్ణశ్రీ అనే ఇద్దరు ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు హేమచంద్రాచార్య నార్త్ గుజరాత్ యూనివర్సిటీ, పాటన్, గుజరాత్‌లో జరగనున్న ప్రీ రిపబ్లిక్ డే క్యాంప్లో పాల్గొనడానికి ఎంపికయ్యారు. ఈసందర్భంగా విశ్వవిద్యాలయ నిర్వాహకులు వారిని ఘనంగా సత్కరించారు.

ఈకార్యక్రమంలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ డీన్ వి. విజయ్ కుమార్,  ఎంఎస్‌ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ సి. మల్లేశ, ప్రోగ్రామ్ ఆఫీసర్లు సంతోష్ కుమార్, టి. పురుషోత్తమ్ పాల్గొన్నారు. వారు ఈ విజయంపై వాలంటీర్లను అభినందిస్తూ, రిపబ్లిక్ డే పరేడ్ క్యాంప్ వైపు తదుపరి పెద్ద అడుగుగా మరింత ఉన్నత విజయాలను సాధించాలని ఆకాంక్షించారు.