1 April, 2026 | 2:15 AM

పరిశోధనలు సమాజ ఆశయాలకు అనుగుణంగా ఉండాలి

01-04-2026 12:34 AM

చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ పురుషోత్తం రెడ్డి

మొయినాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): పరిశోధన కార్యక్రమాలు మరియు సాంకేతిక పురోగతి సమాజ ఆశయాలకు అనుగుణంగా ఉండాలని చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ ఛాన్సలర్ సీహెచ్.వీ. పురుషోతంరెడ్డి పేర్కొన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ లోగల చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో ‘ ఎక్సప్లనబిల్ డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్ ఫర్ అడ్వానస్డ్ వీడ్ డిటెక్షన్ ఇన్ అగ్రికల్చరల్ ఫీలడ్స్ ‘ అనే సిద్ధాంతానికి ఎలగటి మమతకు పీహెచ్.డీ డిగ్రీ పట్టా లభించగా..

మంగళవారం యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ సీహెచ్.వీ. పురుషోత్తం రెడ్డి అధికారికంగా ప్రదానం చేశారు. ఈ పరిశోధన డాక్టర్ జి.సంతోష్ రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. దీంతో యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ సీహెచ్.వీ.పురుషోత్తం రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ సీహెచ్.వీ. పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ... పరిశోధనలు సాంకేతిక పురోగతి సమాజ ఆశయాలకు అనుగుణంగా ఉండాలన్నారు. ఎలక్ట్రానిక్స్ మరియు కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ రంగంలో పరిశోధనలు జాతీయ అభివృద్ధికి కీలకమని తెలిపారు.

వ్యవసాయ క్షేత్రాలలో అధునాతన కలుపు గుర్తింపు కోసం వివరించదగిన డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్ అనే అంశంపై పరిశోధన చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి పరిశోధనలు దేశానికి గర్వకారణమే కాకుండా భవిష్యత్తు అభివృద్ధికి బలమైన పునాదిని ఏర్పరుస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సీహెచ్.సాత్విక రెడ్డి, వైస్ ఛాన్సలర్ జీ.శంకర్ లింగం, రిజిస్టర్ యం.రవీందర్, క్రిస్టోఫర్, ఏ.రాజు, ఏం.జగదీశ్వర్, రాజేందర్ రెడ్డి, డాక్టర్ కే.సీతారాం, వి.కృష్ణ నాయక్, డాక్టర్ ఎస్.నరసయ్య, వి.సునీల్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.