22-11-2025 12:00:00 AM
బీసీ సంఘం డిమాండ్
తాండూరు, నవంబర్ 21 , (విజయ క్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధత కల్పించిన తర్వాతే సర్పం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని , పార్టీలపరంగా రిజర్వేషన్లు నిర్ణయించి సర్పం ఎన్నికలు నిర్వహించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం, బీసీ జేఏసీ నాయకులు అన్నారు. శుక్రవార వికారాబాద్ జిల్లా తాండూర్ సబ్-కలెక్టర్ కార్యాలయాన్ని బీసీ సంఘం మరియు బీసీ జేఏసీ నాయకులు ముట్టడించి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బీసీ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లకు 42% చట్టబద్ధత కల్పించకుం డానే రాష్ర్టంలో సర్పం ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.బీసీ రిజర్వేషన్ల అంశం హైకోర్టులో పెండింగ్లో ఉన్న పరిస్థితుల్లో ప్రభు త్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవడం అన్యాయం అన్నారు, తాండూర్ నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు, యువకులు, మహిళలు భారీగా పాల్గొన్నారు.