calender_icon.png 24 November, 2025 | 3:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామారెడ్డి జిల్లాలో 27, 28 తేదీలలో జనం బాట

22-11-2025 12:00:00 AM

ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో జిల్లాలో పర్యటన

కామారెడ్డి జిల్లా తెలంగాణ జాగృతి చైర్మన్ సంపత్ గౌడ్ 

కామారెడ్డి, నవంబర్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఈనెల 27, 28 తేదీలలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత జనంబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడిం చారు. 27న నిజాంసాగర్ మండలం నుండి బాన్సువాడ, జుక్కల్ ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజక వర్గాల్లో జనం బాట కార్యక్రమం ఉంటుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రజల సమస్యలను ఎమ్మెల్సీ కవిత స్వయంగా తెలుసుకుంటారని జాగృతి జిల్లా ప్రతినిధులు తెలిపారు. 28 న కామారెడ్డి జిల్లా కేంద్రంలో మేధావులతో సమావేశం ఉంటుందని సంపత్ గౌడ్ తదితరులు తెలిపారు. జనం బాట కార్యక్రమాన్ని అభిమానులు కార్యకర్తలు ప్రజలు విజయవంతం చేయాలని సంపత్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు.