calender_icon.png 8 August, 2025 | 9:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల చట్టం అమలు చేయాలి

08-08-2025 01:00:37 AM

- సోషలిస్ట్ కూటమి జాతీయ కార్యదర్శి జై బాబు

ఖైరతాబాద్, ఆగస్టు 7 (విజయక్రాంతి): ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల చట్టం తెచ్చి, అమలు చేయాలని సోషలిస్టు కూటమి జాతీయ కార్యదర్శి ఎల్.జై బాబు రాష్ర్ట కార్యదర్శలు  సింగం శ్రీనివాస్, ఎన్. రాజు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ పై కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు స్పందించాలని, లేనిపక్షంలో తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. గురువారం  సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.

ప్రైవేట్ రిజర్వేషన్లకై చేపట్టే పోరుబాటలో బాగంగా ఆగస్టు 19న అబిడ్స్  గన్ ఫౌండ్రి లోని సూర్యలోక్ కాంప్లెక్స్ లో ఉదయం 10 గంటలకు తెలంగాణ సోషలిస్టు ప్రతినిధుల సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభకు అన్ని పార్టీల నుంచి హాజరవుతారని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగం, ఉద్యోగాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం రంగం అభివృద్ధి చెందడం లేదన్నారు.

ప్రధాని  మోదీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. వలసవాద దోపిడీ పెరగడంతో స్థానిక యువతకు అన్యాయం జరుగు తుందనే విషయం ప్రధాని మోదీ గ్రహించాలని కోరారు. సమావేశంలో సోషలిస్టు కూటమి కార్యవర్గ సభ్యులు బాలస్వామి మహిళా విలాగ కార్యదర్శి నాగ వర్ణ రాణి, యడవల్లి సరిత, అశ్విని హలే తదితరులు పాల్గొన్నారు.