08-10-2025 08:29:58 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవ సంచలన్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఖానాపూర్ పట్టణంలో ఈ ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఖానాపూర్ పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించి ప్రభుత్వ కళాశాల ఆవరణలో జెండా ఆవిష్కరణ జరిపారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.