calender_icon.png 17 October, 2025 | 12:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రతిఘటన.. నన్ను సూపర్ స్టార్‌ను చేసింది!

12-10-2025 01:22:35 AM

‘ప్రతిఘటన’ సినిమా మాత్రమే కాదు.. ఓ సామాజిక చైతన్యం. రాజకీయ అండతో చెలరేగిపోతూ సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న ఓ రౌడీని గొడ్డలితో తెగ నరికిన ఆధునిక ఝాన్సీరాణి కథే ఈ సినిమా. లేడీ సూపర్ స్టార్‌గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న విజయశాంతి ఈ చిత్రంలో తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించారు. 1985, అక్టోబర్ 11న విడుదలైన ఈ మహిళా ప్రాధాన్య చిత్రంలో విజయశాంతి లీడ్ రోల్ పోషించారు.

ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. ఈ సినిమా విడుదలై నాలుగు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ చిత్ర కథానాయకి, ఎమ్మెల్సీ విజయశాంతి స్పందించారు. “ప్రతిఘటన’ సినిమా నాకు ఎప్పటికీ ప్రత్యేకం.

నన్ను సూపర్ స్టార్‌గా నిలబెట్టిన సెన్సేషనల్ హిట్ మూవీ అది. దర్శకుడు టీ కృష్ణ, నిర్మాత రామోజీరావుకు కృతజ్ఞతలు. ‘ఈ దుర్యోధన దుశ్శాసన..’ పాటను అందించిన గేయ రచయిత వేటూరి సుందరామ్మూర్తికి, సినిమాను విశేషంగా ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.