13-10-2025 12:00:00 AM
తెర మీద ఒకే ఫ్రేమ్‌లో ఎన్నిసార్లు చూసినా ప్రేక్షకులు బోర్ ఫీలవ్వని జంట ఏదని అడిగితే అందరూ ఠక్కున చెప్పే పేర్లు.. విజయ్ దేవరకొండ రీల్ లైఫ్‌లో అంతగా మెప్పించిన ఈ జంట నిజ జీవితంలోనూ ఒక్కటి కాబోతున్నారంటూ ఇటీవల వార్తలు వస్తున్నాయి. వచ్చే ఫిబ్రవరిలో పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం జరిగిన విషయాన్ని సన్నిహితులు నిర్ధారించారంటూ వార్తలు వైరల్ అయ్యాయి.
తాజాగా వీరిద్దరి చేతికి ఉంగరాలు కనిపించటం ఈ వార్తలకు బలం చేకూర్చినట్టవుతోంది. ఇటీవల పుట్టపర్తి వెళ్లిన విజయ్ దేవరకొండ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వాటిలో విజయ్ చేతికి బంగారపు ఉంగరం కనిపించడంతో అది ఎంగేజ్‌మెంట్ రింగ్ అంటూ అందరూ అభిప్రాయ పడ్డారు. మరోవైపు రష్మిక పంచుకున్న వీడియోలోనూ ఆమె వేలికి వజ్రపు ఉంగరం మెరుస్తోంది.
రష్మిక తన పెంపుడు కుక్కతో కలిసి ఓ పాట వింటూ ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. ఈ పోస్ట్‌కు తన అప్‌కమింగ్ మూవీ ‘థామ్మా’లోని ‘నువ్వు నా సొంతమా..’ పాట గురించి వ్యాఖ్యలు జోడించింది. అయితే, నెటిజన్లు ‘మేము ఎంగేజ్‌మెంట్ రింగ్ చూసేశాం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంటే, తమ దృష్టి అంతా నేషనల్ క్రష్ వైపు కానీ, ఆమె ముద్దు చేస్తున్న ఆరా మీదుకు కానీ పోవటం లేదని..
తమకు ఉంగరం వేలు ఒక్కటే కనిపిస్తోందని చెప్పకనే చెప్తున్నారు. విజయ్ కలిసి తొలిసారి నటించిన ‘గీత గోవిందం’ సూపర్ హిట్‌గా నిలిచింది. తర్వాత ‘డియర్ కామ్రేడ్’తోనూ మరోమారు అలరించారు. ప్రస్తుతం రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నారు.
ఇందులోనూ రష్మికనే హీరోయిన్‌గా కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక రష్మిక నటించిన చిత్రం ‘థామ్మ’ అక్టోబర్ 21న విడుదల కానుంది. ఆయుష్మాన్ ఖురానా, పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్ధిఖీలు భాగమైన ఈ హర్రర్ కామెడీ చిత్రానికి ‘ముంజ్యా’ ఫేమ్ ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహించారు.