17 August, 2026 | 4:35 PM

సమస్యల పరిష్కారమే ప్రజావాణి లక్ష్యం

17-08-2026 04:02 PM

జన్నారం, (విజయక్రాంతి): ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడమే ప్రజావాణి ప్రధాన లక్ష్యమని ఎంపీడీవో ఉమర్ షరీఫ్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి తహశీల్దార్ బక్కయ్యతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో వెంటనే పరిశీలించి, తగిన పరిష్కారం చూపాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం వహించకుండా అర్జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.