18-02-2026 01:04:44 AM
హనుమకొండ, ఫిబ్రవరి 17(విజయ క్రాంతి): నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా జెఈఈ మెయిన్స్ 2026 మొదటి సెషన్ ఫలితాల్లో వరంగల్ రేజోనేన్స్ కు చెందిన 13 మంది విద్యార్థులు 99 కంటే ఎక్కువ పర్సంటైల్ సాధించారని రేసోనేన్స్ వరంగల్ విద్యాసంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి అన్నారు. అదేవిధంగా 69 మంది విద్యార్థులు 95 పర్సంటైల్ పైన మరియు 141 మంది విద్యార్థులు 90 పర్సంటైల్ కి పైన స్కోర్ సాధించి ఎప్పటిలాగే రేజోనేన్స్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారన్నారు.
అదేవిధంగా బి. సాకేత్ రెడ్డి 260310653522 (99.93),ఎస్. నాగ చైతన్య 260310339623 (99.78),పి. కార్తికేయ 260310124476 (99.76),ఎ. రితిక 260310041885 (99.73),యం. సాయి కౌశిక్ 260310386378 (99.70),జె. హర్షిత్ 260310757255 (99.68),వై. సాత్విక 260310124456 (99.65),యం. డి. అషార్ ఇక్బాల్ 260310405614 (99.36),ఆర్. జయంత్ 260310262227 (99.34) సాధించారు.రేజోనేన్స్ వరంగల్ విద్యార్థులు జెఈఈ అడ్వాన్స్ పరీక్ష అర్హత పొందాటానికి అవసరమైన పర్సంటైల్ తో పాటు ప్రతిష్టాత్మకమైన యన్.ఐ.టి లలో సీట్లు సాధించడానికి కావాల్సిన పర్సంటైల్ సాధించారని రేజోనేన్స్ వరంగల్ విద్యాసంస్థ ల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన అభినందన సభలో అత్యుత్తమ పర్సంటైల్ సాధించిన విద్యార్థులు,వారి తలిదండ్రుల ను రేజోనేన్స్ యాజమాన్యం ఘనంగా సత్కరించారు.అనంతరం చైర్మన్ లెక్కల రాజిరెడ్డి మాట్లాడుతూ ఈ ఘన విజయం వెనక తమ విద్యార్థుల నిరంతర కృషి, తలిదండ్రుల ప్రోత్సా హం మరియు అధ్యాపకుల బోధన సామర్ధ్యం మరియు విద్యార్థుల పట్ల శ్రద్ధ దాగి ఉన్నయన్నారు. ఈ కార్యక్రమంలో రేసోనేన్స్ డైరెక్టర్స్ లెక్కల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్ రెడ్డి, సి.ఎ.ఒ. లెక్కల రమ్యరాజి రెడ్డి, అకాడమీక్ డీన్ బి. యస్. గోపాలరావు కళాశాల ప్రిన్సిపల్స్ మరియు విద్యార్థులు వారి తలిదండ్రులు పాల్గొన్నారు.
జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో మోషన్ కాలేజీ విద్యార్థుల ప్రభంజనం
హనుమకొండ,ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): జేఈఈ మెయిన్స్ 2026 ఫలితాలలో హన్మకొండ మోషన్ జూనియర్ కాలేజీ (కోటా, రాజస్థాన్) విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సా ధించారని మోషన్ జూనియర్ కళాశాల చైర్మన్ వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్ తెలిపారు. సిహెచ్. దేవాన్ష్ 99.25 పర్సెంటైల్ (260310107667),బిట్ల హాసిని 96 పర్సంటైల్ (26031007 2064),పలికా శ్రీవర్ధిత 92.28 పర్సంటైల్ (260310306294),అక్కెనపెల్లి నిహారిక 91.62 పర్సంటైల్ (260310161531),ఇమ్మడి శరణ్య 90.84 పర్సంటైల్ (260310048868),చిరుమళ్ల భార్గవి 90.47 పర్సంటైల్ (260310577200) సాధించినట్లు తెలిపారు.
ఈ సందర్బంగా వేణుగోపాల్ గౌడ్ మాట్లాడుతూ కోటా రాజస్థాన్ మోషన్ హెడ్ సెంటర్ నుండి వచ్చిన కోటా సీనియర్ ఫాకల్టీ, కోటా మెటీరియల్, కోటా ప్రోగ్రాం వల్లనే ఈ ఫలితాలు సాధ్యమైనట్లు తెలిపా రు. ఈ అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు, ఈ విజయానికి అంకితభావంతో కృషి చేసి న అధ్యాపకులకు , ప్రిన్సిపాల్, తల్లిదండ్రులకు మరియు శ్రేయోభిలాషులకు ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మోషన్ కాలేజీ డైరెక్టర్ పెరుమాండ్ల అనిల్ గౌడ్, ప్రిన్సిపాల్ ముత్యాల సురేష్, హన్మకొండ బ్రాంచ్ హెడ్ మారపెల్లి సమ్మయ్య, కోటా అధ్యాపకులు అనూప్ కుమార్, సురేందర్ సాహు, మిథున్, ప్రదీప్ పాఠక్, ఇంటర్ ఫాకల్టీ శ్రీనివాస్ రెడ్డి, సరోత్తం రెడ్డి, లడేగే రమేష్ కాలేజీ సిబ్బంది శనిగరపు సుమన్, తాళ్లపెల్లి రమేష్ గౌడ్, మం డల రాజు, లక్ష్మణ్, అరుణ, ఉమ, స్పందన, మధు, కడారి అనిల్ తదితరులు పాల్గొన్నారు.