calender_icon.png 25 January, 2026 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచితంగా కూరగాయలు పంచి ‘రిటైల్’ నిరసన

28-08-2024 03:05:51 AM

పెద్దపల్లి, ఆగస్టు ౨౭ (విజయక్రాంతి): పెద్దపల్లి కూరగాయల మార్కెట్‌లో హోల్ సేల్, రిటైల్ వ్యాపారుల మధ్య సయోధ్య కుదరడం లేదు.  ఇరువర్గాల మధ్య ఒప్పందం ప్రకారం హోల్‌సేల్ వ్యాపారులు రిటైల్‌గా కూరగాయలు విక్రయించకూడదు. కానీ హోల్‌సేల్ వ్యాపారులు కిలోల చొప్పున కూరగాయలు అమ్ముతుండడంతో రిటైల్ వ్యాపారులు అసంతృప్తితో ఉన్నారు. దీంతో వారు మంగళవారం నిరసనలో భాగంగా వందల కిలోల కూరగాయలను పట్టణవాసులకు ఉచితంగా పంచిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పట్టణవాసులు వందలాదిగా మార్కెట్‌కు తరలివచ్చారు. ఎవరికి వీలైనన్ని కూరగాయలను వారు సంచుల్లో నింపుకొని ఇంటి మార్గం పట్టారు.