17 April, 2026 | 4:49 AM

ఉద్యోగ విరమణ ఆత్మీయ సన్మానం

02-06-2025 02:11 AM

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

హనుమకొండ, జూన్ 1(విజయక్రాంతి): క్రైమ్స్ డీసీపీ జనార్ధన్ నేటి తరం పోలీస్ అధికారులకు స్ఫూర్తిదాయకమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు తెలిపారు. డీసీపీ గా పదవీ విరమణ చేస్తున్న బి.జనార్ధన్ నీ ఎర్రగట్టు గుట్ట కె.ఎల్.ఎన్ గార్డెన్స్ నందు ఘనంగా శాలువాతో సత్కరించి, బుద్ధుడి జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్.ఐ గా పోలీస్ శాఖలో చేరి నేడు డీసీపీ హోదా పదవీవిరమణ చేస్తూ, ఎన్నో విభాగాల్లో పనిచేసి క్లిష్టమైన కేసులను పరిష్కారం చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ లీగల్ సెల్ వైస్ చైర్మన్ నిమ్మాని శేఖర్ రావు, కాంగ్రెస్ నాయకులు సయ్యద్ ఇంతియాజ్, వీసం సురేందర్ రెడ్డి, పోలీస్ అధికారులు, రిటైర్డ్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు