calender_icon.png 8 November, 2025 | 4:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యూరిచ్ చేరుకున్న రేవంత్ రెడ్డి.. ఎయిర్ పోర్టులో కలుసుకున్న సీఎంలు

20-01-2025 02:34:52 PM

స్విట్జర్లాండ్,(విజయక్రాంతి): దావోస్(Davos )లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు(World Economic Forum Conference)లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) బృందం సోమవారం జ్యూరిచ్ చేరుకుంది.  తెలంగాణకు పెట్టుబడులను సమీకరించేందుకు రేవంత్ రెడ్డి టీమ్ సింగపూర్ పర్యటనను ముగించుకొని దావోస్ వెళ్లింది. అనంతరం జ్యూరిచ్ విమానాశ్రయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu Naidu), ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు,  నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, అధికారుల బృందం కలుసుకున్నారు.

రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం బృందం జ్యూరిచ్ చేరుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వెంట మంత్రి శ్రీధర్ బాబు, అధికారుల బృందం ఉన్నారు. దావోస్ లో నాలుగు రోజులపాటు జరుగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు జ్యూరిచ్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న  ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారుల బృందానికి యూరప్ తెలుగు దేశం ఫోరం సభ్యులు ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు వెంట   నారా లోకేష్, కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, టీజీ భరత్ అధికారుల బృందం  ఉన్నారు.