24 August, 2026 | 11:44 PM

Breaking News

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రచ్చబండ కార్యక్రమం: ఎమ్మెల్యే జారె   •   27న కలెక్టరేట్ ముందు మహాధర్నాను జయప్రదం చేయండి: టిజి ఈజేఏసీ   •   వీఎస్టీ కాలనీ అధ్యక్షుడికి ప్రశంసా పత్రం అందజేసిన ఏసీపీ వేంకట్ రెడ్డి   •   కాసాల–రెడ్డిఖానాపూర్ కూడలిలో స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి   •   వార్డెన్ రమేష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం పాల్గొన్న విద్యార్థులు   •   భద్రతకు సీసీ కెమెరాలు అత్యంత కీలకం : ఉప్పల్ డిసిపి   •   రేగన్న రాకతో కార్యకర్తల్లో జోష్   •   విరాహత్ అలీని పరామర్శించిన నర్సాపూర్ ఎమ్మెల్యే   •   చెరువులో పడి జీపీ వర్కర్‌ మృతి   •   మంథనికి విద్యుత్ వెలుగులు మరింత పటిష్టం   •  

16 వార్డుల్లో లోపించిన పరిశుభ్రత

24-06-2026 01:50 AM

తూప్రాన్, జూన్ 23: తూప్రాన్ మున్సిపల్ కార్యాలయంలో సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో గందరగోళం నెలకొన్నది. బి ఆర్ ఎస్ నాలుగో వార్డ్ కౌన్సిలర్ జైపాల్ రాథోడ్ గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను మన హయాంలో చేయకూడదని, మున్సిపల్ లోని ప్రజలు మనల్ని నమ్మి ఓట్లు వేసి గెలిపించారని ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకూడదని ప్రజలకు కావలసిన పద్ధతిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలన్నారు.

ఏ వీధిలో చూసిన డ్రైనేజీ అద్వానంగా తయారైందని, కొన్ని ప్రాంతాలలో మంచినీటి ఎద్దడి ఏర్పడుతుందని ఇప్పటివరకు ఏ వార్డులో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టలేదని నిలదీశారు. గద్ద ప్రభుత్వ హాయంలో అవలంబించిన బిల్లుల పద్ధతిని పునారావృతం కాకుండా చూసుకోవాలని 4వ వార్డు కౌన్సిలర్ జైపాల్ రాథోడ్ మున్సిపల్ సమావేశంలో నిగ్గు తేల్చారు. ప్రతి వార్డుల్లో పారిశుభ్రత పనులను చేపట్టాలని వార్డుకు కావలసిన వనరులను అన్నారు. అనంతరం సమావేశం నుండి వాకౌట్ చేశారు.