14 June, 2026 | 1:44 AM

అబద్దాల అసమర్థ సీఎం రేవంత్

14-06-2026 12:00 AM
  1. మోడీ పాలనలో దేశం అభివృద్ధి 
  2. బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్, జూన్ 13 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, అబద్ధాల అసమర్థ సీఎం రేవంత్‌రెడ్డి అని బీజే ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మడిపడ్డారు. శనివారం కడెం మండల కేంద్రంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తయిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు.

భారతదేశం నరేంద్ర మోడీ నాయకత్వంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని గుర్తు చేశారు. దేశ రక్షణ సమగ్ర అభివృద్ధి మోదీ పాలన వల్ల సాధ్యమైంది అన్నారు. దేశంలో 370 హార్టికల్ రద్దు చేయడం సామాన్య విషయం కాదన్నారు. అటువంటి మోదీ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు చేయడం మానుకొని రాష్ట్రాభివృద్ధికి కేంద్రంతో కలిసి రావాలని మహేశ్వర్‌రెడ్డి సూచించారు. గత ఎన్నికల్లో ప్రజలకిచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయని సీఎం రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని వర్గాల వారు మోసపోయారని పేర్కొన్నారు.

రాష్ట్రంలో రైతులు పండించిన పంటలు కొనుగోలు లేని స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. రైతుబంధు ఏమైందని? రెండు లక్షల రుణమాఫీ అందరికీ మాఫీ కాలేదని, కౌలు రైతు సాయం ఏమైందని? ఏలేటి ప్రశ్నించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటుందన్నారు. రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, పార్టీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.