రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
- మరో నలుగురికి తీవ్ర గాయాలు
- అదుపు తప్పి గుంతలో పడిన కారు
- రఘునాథపల్లి మండలం గోవర్దగిరి దర్గా వద్ద ఘటన
జనగామ, జూన్ 13 (విజయక్రాంతి): హైదరాబాద్ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్దగిరి దర్గా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.టీజీ 24బీ9237 నెంబరు గల ఎర్టిగా కారులో హైదరాబాద్ నుంచి హనుమకొండ వైపు వెళ్తుండగా కారు అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడింది.
ఆ సమయంలో కారులో ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఎండీ అసద్ (26), అప్సా హబీబ్ (27)లు ఘటన స్థలంలో అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవర్ రహముద్దిన్ ఖాన్, షాహిద్ బేగం, ఇలేష, రేష్మకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం నిద్ర మత్తులో కారు అదుపుతప్పి ఈ ప్రమా దం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.
వీరంతా వరంగల్ నయీమ్ నగర్‌వాసులగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రు లను జనగామ చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను కూడా ఇదే ఆసుపత్రిలోని మార్చురీలో భద్రపరిచి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ దూదిమెట్ల నరేష్ యాదవ్ తెలిపారు.






