13-01-2026 12:00:00 AM
హైదరాబాద్, జనవరి 12 (విజయక్రాంతి): విచారణ అర్హత లేని పిటిషన్ వేసి ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం-నల్లమల సాగర్‌కు పూర్తిస్థాయిలో సహకరిస్తున్న రేవంత్‌రెడ్డి నిజస్వరూపం, ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని మాజీమంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు పాలమూరు ప్రాజెక్టు విషయంలో రైతులతో రిట్ వేయించి మరీ ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుకు స్టే సాధిస్తే, ఇక్కడి చేతగాని కాంగ్రెస్ సర్కారు మాత్రం ఉద్దేశపూర్వకంగానే విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు.
\‘ఈ మాత్రం విషయం మీ న్యాయవాది, మీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకి తెలియదా’ అని ప్రశ్నించారు. దీనికోసం నీళ్ల మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి సూటుబూటు వేసుకొని ఢిల్లీ దాకా వెళ్లాలా అని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం ట్విట్టర్ వేదికగా హరీశ్‌రావు స్పందించారు. ముఖ్య మంత్రిగా ఉం టూ మన నీటి హక్కులను ఏపీ కి ధారాదత్తం చేస్తూ రేవంత్‌రెడ్డి తెలం గాణకు చేస్తున్న చారిత్రక ద్రో హం ఇది అని హరీశ్‌రావు విమర్శించారు.
రిట్ ఉపసంహరించుకొని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే, పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టు కట్టుకోవడానికి ఏపీకి గడువు ఇవ్వడమేనని మండిపడ్డారు. ఏపీ, తెలంగాణతో పాటు మహారాష్ర్ట, కర్ణాటక వాదనలు కూడా వినడం అనేది ఏండ్లు గడిచినా ముగియని కథే అని స్పష్టం చేశారు. ఈ లోగా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టు పనులు పూర్తి చేసుకొని, తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తూ అప్పనంగా నీళ్లను తరలించుకు పోతుందని తెలిపారు.
చంద్రబాబుకు సంక్రాంతి గిఫ్ట్.. పసలేని రిట్
సంక్రాంతి పండుగ వేళ రేవంత్ చంద్రబాబుకు ఇచ్చిన గిఫ్టే.. సుప్రీం కోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్టు అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సుప్రీం కోర్టులో వేసిన ఈ బలహీనమైన రిట్టు అని విమర్శించారు. పోలవరం-నల్లమల సాగర్ విష యంలో ముందు నుంచి రేవంత్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం ఏపీకి పూర్తిగా సహకరిస్తున్నదని ఆరోపించారు. పస లేని రిట్ వేసి పరిపూర్ణంగా నల్లమల సాగర్‌కు సీఎం రేవం త్ మద్దతు ప్రకటించారని విమర్శించారు.
తెలంగాణ నీటిహక్కులను గంపగుత్తగా ఏపీ కి అప్పజెప్పడమేనా మీ చర్చల లక్ష్యమా? అన్నారు. చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్‌రెడ్డి.. ‘నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు’ అని స్పష్టం చేశారు. రేవంత్‌రెడ్డి.. నీ గురుదక్షిణ కోసం రాష్ట్రానికి ద్రోహం చే స్తుంటే రాష్ట్రాన్ని సాధించిన బీఆర్‌ఎస్ చూ స్తూ ఊరుకోదని, తెలంగాణ నీటి హక్కుల కోసం పోరు చేస్తామని హెచ్చరించారు.