calender_icon.png 14 January, 2026 | 5:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధిర మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి టీడీపీ సిద్ధం

13-01-2026 12:00:00 AM

డాక్టర్ వాసిరెడ్డి రామనాథం

ఎర్రుపాలెం జనవరి 12 (విజయ క్రాంతి): మధిర మున్సిపాలిటీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో వార్డుల్లో పోటీచేయటానికి టిడిపి సిద్ధంగా వుందని, ఖమ్మం పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ కన్వీనర్ డాక్డర్ వాసిరెడ్డి రామనాథం తెలిపారు. ఈరోజు స్థానిక టిడిపి కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు మల్లాది హనుమంతరావు అధ్యక్షతన జరిగిన అన్ని వార్డుల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, జిల్లా రాష్ట్ర, నాయకుల టిడిపి సన్నాహక సమావేశంలో డాక్టర్ రామనాథం మాట్లాడుతూ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు మున్సిపల్ ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందని, నాయకులు, కార్యకర్తలు సిద్ధంగావుండాలని, టిడిపి పట్ల ప్రజల్లో సానుకూలత బాగా పెరిగిందని, టిడిపి సారథ్యంలో మధిర మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారని ఎన్నికలు అయ్యేంతవరకు ప్రజల్లో వుండి ఐక్యంగా పనిచేసి, టీడీపీ అభ్యర్థులకు మద్దతు ఇచ్చేపార్టీలనుండి మద్ధుతు తీసుకొని ప్రతిగా వారికి మద్ధతు ఇచ్చి మధిర మునిసిపాలిటీ కైవసం చేసుకునే దిశగా కృషి చేయాలని ఆయన కోరారు.

ఈ సమావేశంలో టిడిపి రాష్ట్ర నాయకులు చేకూరి శేఖర్ బాబు, ఐటిడిపి మాజీ కార్యదర్శి వేమూరి సునీల్, తెలుగు యువత రాష్ట్ర నాయకులు యలమంచిలి శివ, మధిర రూరల్ టిడిపి అధ్యక్షుడు మార్నీడి పుల్లారావు, మహిళా నాయకురాలు మేడేపల్లి రాణి, మాజీ కౌన్సిలర్ వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు, పట్టణ ఉపాధ్యక్షుడు మేడా వెంకటేశ్వరరావు, కార్యదర్శి చట్టు వెంకటేశ్వర్లు, మాజీ కార్యదర్శి చెరుకూరి కృష్ణారావు, టిడిపి నాయకులు గద్దల ప్రకాశరావు, పాశం రామనాథం, చటారి ముసిలి, వాసిరెడ్డి ఉపేంద్ర, చిరపంజి ఆశీర్వాదం, వేల్పుల కొండ, రావూరి రంగయ్య, మేదరమెట్ల నవీన్, తుళ్లూరి శ్రీనివాసరావు, అనిల్, కొర్లగంటి మాధవరావు, నాగులంచ శ్రీను, యడవల్లి శ్రీధర్, పోతినేని సాయి, పోతినేని కోటేశ్వరరావు, జమ్ముల కోటేశ్వరరావు, మైనీడి జగన్మోహన్ రావు, గడ్డం రమేష్, మాచర్ల శ్రీనివాసరావు, చెన్నం స్వామి, వీరవల్లి కోటేశ్వరరావు, ములకలపల్లి వినయ్, గడ్డం మల్లికార్జునరావు, తిరుపతి కృష్ణమూర్తి, కేశవపట్నం రామయ్య, పుట్టా భాస్కర్ రావు, బోణాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.