6 August, 2026 | 2:14 AM

సమ్మిళిత అభివృద్ధికి సైబరాబాద్‌లో సమీక్ష

06-08-2026 12:00 AM

ఎస్సీ,ఎస్టీ కాలనీల అభివృద్ధి, సంక్షేమ పథకాలపై చైర్మన్ బక్కి వెంకటయ్య సమీక్ష

శేరిలింగంపల్లి,ఆగస్టు 5 (విజయక్రాంతి): సైబరాబాద్లో ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి, సంక్షేమం, మౌలిక సదుపాయాల క ల్పనపై బుధవారం కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సైబరాబాద్ ము న్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, అన్ని జోన్ల కమిషనర్లు, వివిధ శాఖల విభాగాధిపతులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో ప్రత్యేక సబ్ప్లాన్ల ద్వారా ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధి, శ్మశాన వాటికలకు అవసరమైన సదుపాయాలు, అప్రోచ్ రోడ్ల నిర్మాణం, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల అభివృద్ధి వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది. వీధి వ్యాపారులకు సహాయం, పారిశుధ్య కార్మికులకు పిపిఈ కిట్లు, బీమా సదుపాయం, శాశ్వత ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఉపాధి అవకాశాలు, ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాలను కూడా సమీక్షించారు.

సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా చర్యలు తీసుకోవాలని చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులను ఆదేశించారు.సైబరాబాద్లో సమానత్వం, సమ్మిళిత అభివృద్ధి లక్ష్యంగా ఈ సమీక్ష జరిగినట్లు అధికార వర్గాలు తెలిపారు.