ప్రభుత్వ విద్యాలయాలే ప్రగతికి గీటురాళ్లు
శారదాంబ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంగాధరరావు
జవహర్‌నగర్, ఆగస్టు 5 (విజయక్రాం తి): ప్రభుత్వ విద్యాలయాలే ప్రగతికి గీటు రాళ్లు అని శారదాంబ బ్రాహ్మణ సంక్షేమ సంఘం అధ్యక్షులు గంగాధర్ రావు పేర్కొన్నారు. మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ ప్ర భుత్వ ఉన్నత పాఠశాలలో ఆరవ తరగతి వి ద్యార్థులకు బుధవారం స్కూలు బ్యాగులు స్టే షనరీ అందజేశారు. ఈ సందర్భంగా గంగాధర్ రావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యాల యాలు ప్రతిభావంతులకు వేదికలని విద్యార్థులు విద్యతోపాటు విద్యేతర కార్యక్రమాల్లో ముందు ఉండడం అభినందనీయమన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ప్రతిభలో అంతర్జాతీయ స్థాయిలో రాణించగలుగుతున్నా రంటే కారణం ఉపాధ్యాయు ల కృషి విద్యార్థుల పట్టుదలయే అని అన్నా రు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థు లు మరెన్నో కీర్తి కిరీటాలను అధిరోహించి పాఠశాలకు తద్వారా జవహర్ నగర్ కే కా కుండా దేశానికి పేరు తేవాలని సూచించా రు.
అనంతరం ఆరో తరగతి చదువుతున్న 54 మంది విద్యార్థులకు ఉచితంగా పాఠశా ల బ్యాగులు నోటుబుక్స్ స్టేషనరీ సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మ ణ సేవా సమితి సంఘం కోశాధికారి సిహెచ్ భానుమూర్తి, ఏ. రామ్మోహన్రావు, పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, రాజేందర్, పెంచలయ్య, ఉషారాణి, మేరీ లావణ్య కోమలి, విద్యార్థులు పాల్గొన్నారు.






