calender_icon.png 23 October, 2025 | 11:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం మహాజాతర ఏర్పాట్లపై సమీక్షా సమావేశం

23-10-2025 02:07:08 AM

ములుగు,అక్టోబరు22(విజయక్రాంతి): ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఈ రోజు సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ సబ్యసాచి ఘోష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. మేడారం జాతరకి గిరిజన సంక్షేమ శాఖ రూ. 150.00 కోట్లు మంజూరు చేయగా అందులో రూ. 90.00 కోట్లు సివిల్ వరక్స్ కు, రూ. 60.00 నాన్ సివిల్ వరక్స్ కు ఉద్దేశించారు.ఈ సమావేశంలో సివిల్ వరక్స్ స్టేటస్, నాన్ సివిల్ వరక్స్ యాక్షన్ ప్లాన్ మీద సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సబ్యసాచి ఘోష్ ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.తో కలిసి మాట్లాడుతూ... మేడారం జాతర ఏర్పాట్లను మొత్తం 8 జో న్లు, 31 సెక్టార్లుగా విభజించినట్లు తెలిపారు. జోన్3 జంపన్న వాగు ప్రాంతంగా నిర్ణయించబడింది. జాతర సమయంలో 10 నుండి 12 వేలమంది పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ప్రతి జోన్కు ఒక జోనల్ ఆఫీసర్ను నియమించ నున్నారు.24 శాశ్వత టవర్స్, 20 సెల్-ఆన్-వీల్స్, 350 వై-ఫై పా యింట్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.కోర్ రూట్లు మరియు పార్కింగ్ ప్రదే శాలను గుర్తించారు.

మొత్తం 49 పార్కింగ్ ప్రదేశాలు (1050 ఎకరాలు) గుర్తించబడి, దాదాపు 4.5 నుండి 6 లక్షల వాహనాలు నిలిపే సదుపాయం కల్పించబడుతుంది. ఈ ఏర్పాట్లు నవంబర్ 30 నాటికి పూర్తవుతాయని తెలిపారు.అటవీ శాఖ ఆధ్వర్యంలో 24+9 ఫారెస్ట్ రోడ్లు (కచ్చా నుండి డబుల్ లేన్) రూపంలో అభివృద్ధి చేస్తున్నారు. వీటిలో భాగంగా వైల్‌లైఫ్ శాంక్చువరీలోని రహదారులు కూడా చేర్చబడ్డాయి.ఆర్ & బీ శాఖ ద్వారా 42 కోట్లతో ఆలయం చుట్టూ రహదారులు, మరియు 92 కోట్లతో ప్రధాన రహదారులు నిర్మించబడుతున్నాయి.

జాతర సమయానికి ముందు, మధ్య మరియు తరువాత ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ప్రత్యేక జాతర సందర్శనలు చేపట్టనున్నట్లు తెలిపారు. జంపన్న వాగు వద్ద తాత్కాలిక రహదారి కూలిపోయిన కారణంగా మరమ్మత్తు పనులు వేగంగా జరుగుతున్నాయి. 517 బోరుపాయింట్లు/నీటి వనరులు, 250 కిలోమీటర్ల రహదారులపై లైటింగ్ పనులు జరుగుతున్నాయి.స్థానికుల సహకారంతో 6స్లాటర్ సెంటర్లు ఏర్పాటు చేయబడ్డాయి. జంపన్న వాగు పునరుద్ధరణ పనులు సాగిస్తున్నట్లు ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు.