calender_icon.png 23 October, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొమరం భీం జయంతి ఉత్సవం

23-10-2025 02:08:29 AM

వెంకటాపురం(నూగూరు), అక్టోబర్ 22(విజయక్రాంతి): ఆదివాసి సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం వెంకటాపురం మండల కేంద్రంలో కొమరం భీమ్ విగ్రహానికి మహిళా నాయకులు జేజ్జరి నారాయణమ్మ, ఇర్ప లక్ష్మి పూజ కార్యక్రమాన్ని కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు పశువుల సూర్యనారాయణ, సిద్ధిబోయిన భుజంగరావు కొమరం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆదివాసి నవ నిర్మాణ సేన రాష్ట్ర అధ్యక్షులు కొర్సా నరసింహమూర్తి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసం నాగరాజు, తెలంగాణ భూమి పుత్ర ఆదివాసి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పూనెం రామచందర్రావు, గోండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర నాయకులు పూనెం సాయి, చింత సమ్మయ్య, ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్సిక సతీష్ మాట్లాడుతూ ఆదివాసి పోరాట యోధుడు,గోండు బొబ్బిలి కొమురం భీం125వ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.

ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మాట్లాడుతూ లంబడాలు మహారాష్ట్రంలో బీసీలుగా చత్తీస్గడ్ రాష్ట్రంలో ఎస్సీలుగా, రాజస్థాన్లో ఓసిలుగా ఉంటూ తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ఎస్టీలుగా కొనసాగుతారని వారు ప్రశ్నించారు.1976 సంవత్సరం నుండి లంబడాలు అక్రమంగా ఎస్టీలుగా కొనసాగడం వల్ల ఆదివాసీల రిజర్వేషన్, విద్యా, ఉద్యోగ, రాజకీయ, సంక్షేమ పథకా లలో మొత్తం లంబాడీలు అక్రమంగా దోచుకుంటున్నారని వారు మండిపడ్డారు.

ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 3న ఏటూరు నాగారం ఐ.టి.డి.ఏ నందు తెలంగాణ రాష్ట్రంలో చట్టబద్ధతలేని లంబాడీలను తొలగించాలని కోరుతూ ఐటీడీఏ ముట్టడి కార్యక్ర మాన్ని జయప్రదం చేయాలని ఆదివాసి ప్రజలకు యువతి, యువకులకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ జిల్లా నాయకులు కుచ్చంటి చిరంజీవి, గోండ్వానా సంక్షేమ పరిషత్ జిల్లా అధ్యక్షులు పూనెం ప్రతాప్, ఆదివాసి నవనిర్మాణ సేన జిల్లా నాయకులు కుంజ మహేష్ , శంకర్, ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు క్రిష్ణ బాబు, ఉపాధ్యక్షులు తాటి రాంబాబు, తాటి లక్ష్మణరావు, ఉండం రాంప్రసాద్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.