calender_icon.png 23 October, 2025 | 7:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ అధికారుల పేరిట టోకరా

23-10-2025 02:05:38 AM

వరంగల్, అక్టోబర్ 22 (విజయ క్రాంతి): వరంగల్ ఆర్టీఏ అధికారులను ఏసీబీ పేరు తో సైబర్ నేరస్తులు బురిడీ కొట్టించారు. కే సులను మాఫీ చేస్తామని పేరుతో రూ.10 లక్షల20వేలకు పైగా కాజేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో నాలుగు రోజుల కిందట వరంగల్ ఆర్టీఏ అధికా రులకు గుర్తు తెలియని వ్యక్తులు 98868 26656, 98804 722 72, 95919 38585 నెంబర్ నుంచి ఫోన్ చేసి ఆర్టీఏ కార్యాలయంలో జరుగుతున్న అవినీతి అంతా తెలుసని, అరెస్టు కాకుండా ఉండాలంటే డబ్బులు పంపించాలని ఎంవీఐలను బెదిరించగా దశల వారీగా రూ.10ల క్షల 20 వేలను గుర్తు తెలియని వ్యక్తుల అ కౌంట్లోకి జమ చేశారు.

ఫోన్ మాట్లాడుతున్న ఓ అధికారికి అనుమానం రావడంతో ఏసీబీతో పాటు పోలీసులను ఆశ్రయించారు. వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం వరంగల్ ఆర్టీఏ కార్యాలయంలో కొన్ని రో జుల క్రితం ఏసీబీ అధికారులు తనిఖీలు చే శారు. ఆ తర్వాత కొందరు సైబర్ నేరస్తులు కార్యాలయం కు ఫోన్ చేశారు. ఆర్టీఏ జిల్లా అధికారిని లైన్ లోకి తీసుకొని కేసు విషయంపై బెదిరింపులు చేశారు.

ఆయనను లై న్లో పెట్టి మరో అధికారితో మాట్లాడారు. కే సులు మాఫీ కావాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిజిటల్ అరెస్టు పేరు మీ ద వారిని లైన్లోనే ఉంచి మాట్లాడారు.విడత ల వారీగా వారి నుంచి డబ్బులను వసూలు చేశారు.సుమారుగా రూ.10లక్షల 20వేలకు పైగా డబ్బులు వేయించుకొని వదిలిపెట్టా రు. వారు మాట్లాడే విధానంలో అనుమా నం వచ్చిన ఆర్టీఏ అధికారులు తర్వాత ఏసీ బీ అధికారులతో మాట్లాడారు.

తాము మో సపోయామని గుర్తించారు. వెంటనే ఏసీబీ అధికారుల సూచన మేరకు వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధికారులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ కాల్, బ్యాంక్ అకౌంట్ల వివరాల ప్రకారం క ర్ణాటకలోని బీదర్ ప్రాంతం నుంచి సైబర్ నేరస్తులు ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఈ వి షయం సంచలనం సృష్టించగా ఏసీబీ అధికారులు ఎవరూ నేరుగా అధికారులతో మా ట్లాడరని అటువంటి కాల్స్ వస్తే తమ దృష్టికి తీసుకురావడంతో పాటు సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపారు. సైబర్ నేరస్థుల పట్ల అప్రమత్తంగాఉండాలన్నారు.