08-09-2025 09:16:01 AM
మహబూబాబాద్ (విజయక్రాంతి): చంద్ర గ్రహణా(Lunar eclipse)న్ని పురస్కరించుకొని ఆదివారం మధ్యాహ్నం మూసివేసిన దేవాలయాల తలుపులను చంద్రగ్రహణం అనంతరం సోమవారం ఉదయం తెరిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని దేవాలయాల తలుపులను అర్చకులు తెరిచి ఆలయంలో సంప్రోక్షణ కార్యక్రమాలను చేపట్టారు. అనంతరం దేవతామూర్తులకు అర్చన అభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు.