08-09-2025 10:06:37 AM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో యూరియా కోసం రైతులు తిరుగుతూనే ఉన్నారు. సోమవారం ఉదయం మహబూబాబాద్ జిల్లా శనిగపురం ఎరువుల విక్రయ కేంద్రం వద్ద యూరియా కోసం వచ్చిన రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. అనంతరం ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్(SP Kekan Sudhir Ramnath) మాట్లాడుతూ, నేడు టోకెన్లు పొందిన రైతులకు మంగళవారం యూరియా పంపిణీ చేస్తామని, టోకెన్లు పొందిన వారందరికీ యూరియా పంపిణీ చేసిన తర్వాత, గ్రామాల వారీగా ఎక్కడికక్కడే యూరియా పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. యూరియా కోసం జిల్లా కలెక్టర్ తో మాట్లాడుతానని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్వయంగా ఎస్పీ మైకు ద్వారా రైతులకు విజ్ఞప్తి చేశారు. దీనితో టోకెన్లు పొందిన రైతులు యూరియా బస్తాలు రేపు ఇస్తారని చెప్పడంతో నిరాశతో తిరుగు ముఖం పట్టారు.