calender_icon.png 8 September, 2025 | 3:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డికి ఊరట..

08-09-2025 12:04:11 PM

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసును తాజాగా సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టివేసింది. గత నెలలో రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని మారుస్తున్నారంటూ ఎన్నికల్లో ప్రచారం చేయడంపై, ఆయన చేసిన వ్యాఖ్యాల పట్ల మూల్యం చెల్లించాలని తెలంగాణ బీజేపీ హైకోర్టుకు పిటిషన్ లు వేసింది. కాగా బీజేపీ వేసిన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వ్యులను సవాల్ చేస్తూ బీజేపీ సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ను వేసింది. సీజేఐ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మసనం పిటిషన్ పై విచారణ జరిపారు. విచారణ అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయి ధర్మసనం బీజేపీ పిటిషన్ ను డిస్మిస్ చేశారు. రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాజకీయ నేతలకు సున్నిత మనసు ఉండకూడదని.. కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని సీజేఐ ఆరోపించింది.