08-09-2025 11:01:00 AM
మంథని (విజయక్రాంతి): మంథని(Manthani) బొక్కల వాగులో పడి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంథని పోలీసుల కథనం ప్రకారం, కామ సురేష్(36) అనే వ్యక్తి ఆదివారం అర్థరాత్రి మంథని బొక్కల వాగులో పడడంతో అటువైపు పెట్రోలింగ్ వెళ్ళిన పోలీస్ సిబ్బంది 108కి సమాచారం అందించారు. గాయపడ్డ అతనిని హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని అతడిని బయటకి తీసి ప్రాథమిక చికిత్స చేస్తూ మంథని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అతడి స్వస్థలం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలం తాడిచెర్ల గ్రామానికి చెందిన వాడని గుర్తించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బంది ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నిమ్మతి శ్రీనివాస్, పైలెట్ ఆకుల మల్లేష్ లకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మరి అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డా, ప్రమాదవశాత్తు జారిపడ్డడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.