calender_icon.png 8 September, 2025 | 1:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేడు గోదావరి తాగునీటి పథకం ఫేజ్-2, 3 పనులకు శంకుస్థాపన

08-09-2025 09:13:48 AM

హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం గోదావరి తాగునీటి పథకం ఫేజ్-2, 3 పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ. 7360 కోట్లతో హ్యామ్ విధానంలో చేపట్టే పనులకు సీఎం చేదుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. అలాగే ఉస్మాన్ సాగర్ వద్ద తాగునీటి పథకానికి కూడా సీఎం రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ప్రభుత్వం వాటా 40 శాతం, కాంట్రాక్టు కంపెనీ 60 శాతం నిధులతో ఈ పథకం శంకుస్థాపన జరుగనుంది. రెండేళ్లలో గోదావరి ఫేజ్-2, 3 పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మూసీ పునరుజ్జీవనంలో భాగంగా గోదావరి ఫేజ్-2, 3 తాగునీటి పథకం ప్రారంభోత్సవం జరగనుండగా.. ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ లోకి గోదావరి జలాలను ప్రభుత్వం తరలించనుంది.