08-09-2025 12:43:36 PM
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): ఆసరా పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్(MRPS) ఆధ్వర్యంలో సోమవారం వృద్ధులు, వికలాంగులు నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈ సందర్భంగా వారు నినాదాలు చేస్తూ ప్రభుత్వానికి తమ డిమాండ్లను వినిపించారు. ప్రస్తుతం లభిస్తున్న పెన్షన్ తో జీవించటం సాధ్యపడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్‌ను గణనీయంగా పెంచాలని, ప్రతినెలా సమయానికి చెల్లింపులు జరగాలని కోరారు. చాలామందికి నూతన పెన్షన్లు మంజూరు చేయకపోవడంతో అర్హులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ వారి నుండి వినతి పత్రాన్ని స్వీకరించి ప్రభుత్వానికి నివేదిస్తామని హామీ ఇచ్చారు.